మష్రూమ్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-10-19T18:35:40+05:30 IST

పుట్టగొడుగులు - అరకిలో, ఉప్పు - తగినంత, క్రీమ్‌ - ఒకటిన్నర కప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, మిరియాలు - నాలుగైదు, పిండి - అరకప్పు, వెన్న - 80 గ్రాములు, చికెన్‌ స్టాక్‌..

మష్రూమ్‌ సూప్‌

కావలసినవి
 
పుట్టగొడుగులు - అరకిలో, ఉప్పు - తగినంత, క్రీమ్‌ - ఒకటిన్నర కప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, మిరియాలు - నాలుగైదు, పిండి - అరకప్పు, వెన్న - 80 గ్రాములు, చికెన్‌ స్టాక్‌ - నాలుగున్నర కప్పులు.
 
తయారీవిధానం
 
పుట్టగొడుగులను కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఒక పాన్‌ తీసుకుని కొద్దిగా వెన్న వేసి వేడి అయ్యాక వెల్లుల్లి, పుట్టగొడుగులు వేసి వేగించాలి. పిండి వేసి మరికాసేపు వేగించాలి. తరువాత చికెన్‌స్టాక్‌, తగినంత ఉప్పు, మిరియాలు వేసి వేగనివ్వాలి. పాన్‌పై మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ సూప్‌కు క్రీమ్‌ కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-10-19T18:35:40+05:30 IST