ఖీర్‌

ABN , First Publish Date - 2019-10-05T19:32:38+05:30 IST

పాలు - ఒక లీటరు, బియ్యం - పావుకప్పు, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, బాదం - పది పలుకులు,

ఖీర్‌

కావలసినవి
 
పాలు - ఒక లీటరు, బియ్యం - పావుకప్పు, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, బాదం - పది పలుకులు, జీడిపప్పు - పది పలుకులు, ఎండు ద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
బియ్యాన్నిశుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. బియ్యంలో నీళ్లు వంచేసి మరుగుతున్న పాలలో బియ్యం వేసి కలపాలి. చిన్నమంటపై ఉడికించాలి. బియ్యం కాస్త ఉడికిన తరువాత పంచదార వేయాలి. అన్నం దాదాపు ఉడికిన తరువాత బాదం, జీడిపప్పు, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేయాలి. స్టవ్‌పై నుంచి దింపుకొన్న తరువాత ఎండు ద్రాక్ష వేయాలి. వేడిగానూ, చల్లగానూ సర్వ్‌ చేసుకోవచ్చు.
మహాసప్తమి రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు.

Updated Date - 2019-10-05T19:32:38+05:30 IST