Abn logo

కొబ్బరి బూరెలు

కావలసినవి:బియ్యప్పిండి - కేజీ, బెల్లం - ముప్పావు కేజీ, కొబ్బరి ముక్కలు - రెండు, డాల్డా - 100గ్రాములు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా.
 
తయారీ విధానం: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్‌ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్‌ వేసి పొడి చేసుకోవాలి.వెడల్పాటి పాన్‌లో బెల్లంను వేడి చేయాలి. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.పాన్‌లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.

బాసుందిమ్యాంగో పనీర్‌ రోల్స్‌పుచ్చకాయ హల్వాబ్రెడ్ గులాబ్ జామ్పనీర్‌ లడ్డుడ్రై ఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ చిక్కీబనానా హల్వాపాలకోవా బ్రెడ్‌చిలగడ దుంపల జామూన్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement