గుమ్మడికాయ పచ్చడి

ABN , First Publish Date - 2019-12-14T17:00:02+05:30 IST

గుమ్మడికాయ - 300గ్రాములు, పసుపు - అర టీస్పూన్‌, బెల్లం - రెండు టీస్పూన్లు, ఉప్పు

గుమ్మడికాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ - 300గ్రాములు, పసుపు - అర టీస్పూన్‌, బెల్లం - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరి తురుము - అర కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం - చిన్నముక్క, కరివేపాకు - కొద్దిగా, నూనె - ఒక టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అరటీస్పూన్‌.
 
తయారీ విధానం: ముందుగా గుమ్మడికాయను ముక్కలుగా కట్‌ చేసి కొద్దిగా ఉప్పు చల్లి, పసుపు వేసి, కొన్ని నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. ఆవిరిపోయిన తరువాత గుమ్మడికాయ ముక్కలు తీసి, బెల్లం, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. ఈ పోపును గుమ్మడికాయ మిశ్రమంపై పోసి కలియబెట్టుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-14T17:00:02+05:30 IST