గుమ్మడికాయ పులుసు

ABN , First Publish Date - 2019-12-14T16:58:17+05:30 IST

గుమ్మడికాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, మెంతులు -

గుమ్మడికాయ పులుసు

కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, మెంతులు - చిటికెడు, చింతపండు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాలపొడి - ఒక టీస్పూన్‌, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.
 
తయారీ విధానం: చింతపండును నీటిలో శుభ్రంగా కడిగి పులుసు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగించాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కాస్త ఉప్పు చల్లాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి వేగించాలి. పసుపు, కారం వేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు బెల్లం, చింతపండు రసం పోసి కలియబెట్టాలి. చిన్న మంటపై మరగనివ్వాలి. పులుసు మరుగుతున్న సమయంలో ధనియాల పొడి వేయాలి. రుచి చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపుకొంటే ఘుమఘుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ.

Updated Date - 2019-12-14T16:58:17+05:30 IST