Abn logo

గుమ్మడి బొబ్బట్లు

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము - 3 కప్పులు, బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు, మైదా - ముప్పావు కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - తగినంత.
 
తయారీ విధానం: దళసరి అడుగున్న కడాయిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి గుమ్మడి తురుముని వేగించాలి. తర్వాత బెల్లం తురుము వేసి మిశ్రమాన్ని చిన్నమంటపై చిక్కబడనివ్వాలి. ఇప్పుడు యాలకుల పొడి కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకుని పక్కనుంచాలి. మరో పాత్రలో మైదా, స్పూను నెయ్యి వేసి నీళ్లు కలుపుతూ చపాతి పిండిలా ముద్దగా చేసుకొని గంటపాటు పక్కనుంచాలి. తర్వాత కొంతకొంత పిండి తీసుకుని అరచేతిలో ఒత్తి గుంతలా చేసి గుమ్మడి మిశ్రమం పెట్టి మూసి, బొబ్బట్లు ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో దోరగా కాల్చుకోవాలి. వీటిని వేడిమీద ఉండగానే తింటే చాలా రుచిగా ఉంటాయి.

మ్యాంగో పనీర్‌ రోల్స్‌పుచ్చకాయ హల్వాబ్రెడ్ గులాబ్ జామ్పనీర్‌ లడ్డుడ్రై ఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ చిక్కీబనానా హల్వాపాలకోవా బ్రెడ్‌చిలగడ దుంపల జామూన్‌చిలగడదుంప స్వీట్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement