కాజూ ఫ్లవర్‌

ABN , First Publish Date - 2019-10-26T20:00:44+05:30 IST

జీడిపప్పు - అరకప్పు, ఫుడ్‌ కలర్‌(ఎరుపు, ఆకుపచ్చ) - చిటికెడు, నెయ్యి - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - పావుకప్పు.

కాజూ ఫ్లవర్‌

కావలసినవి
 
జీడిపప్పు - అరకప్పు, ఫుడ్‌ కలర్‌(ఎరుపు, ఆకుపచ్చ) - చిటికెడు, నెయ్యి - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - పావుకప్పు.
 
తయారీవిధానం
 
జీడిపప్పును మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాన్‌ తీసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని పంచదార వేసి పానకం తయారు చేయాలి. పానకం తయారయ్యాక జీడిపప్పు పొడి వేసి కలపాలి. చిన్నమంటపై కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో స్టవ్‌పై నుంచి దింపి నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చాలి. మిశ్రమాన్ని ప్లేట్‌లో రెండు సమభాగాలుగా చేసి, ఒకదాంట్లో ఎరుపు, మరొక దాంట్లో ఆకుపచ్చ ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఈ సమయంలో అర టేబుల్‌స్పూన్‌ పాలు పోసి కలపాలి. లేదంటే మిశ్రమం చపాతీ పిండిలా అవుతుంది. తరువాత చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇప్పుడు ఒక ఉండను కాస్త వెడల్పు చేసి మరో ఉండను మధ్యలో పెట్టి చుట్టూ కలపాలి. తరువాత కత్తితో ఫ్లవర్‌ ఆకృతిలో కట్‌ చేయాలి. దీపావళి రోజున ఈ కలర్‌ఫుల్‌ స్వీట్స్‌ కను‘విందు’ చేస్తాయి.

Updated Date - 2019-10-26T20:00:44+05:30 IST