Abn logo

స్వీట్‌ అమ్మిని కొళుకట్టై

కావలసినవి
 
బియ్యప్పిండి - అరకప్పు, బెల్లం - పావు కప్పు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - ఒక టీస్పూన్‌, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, నీళ్లు - తగినన్ని, ఉప్పు - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో బియ్యప్పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేయాలి. మరొక పాత్రలో నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లను కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్నట్లయితే కాసేపు చల్లారిన తరువాత కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని స్టీమర్‌ ప్లేట్‌లో లేదా ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఒక పాన్‌ తీసుకొని కొబ్బరి తరుము, నువ్వులను వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక ఉడికించిన ఉండలు, కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి వేయాలి. చివరగా నెయ్యి వేసుకొని దింపి సర్వ్‌ చేసుకోవాలి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement