బనానా హల్వా

ABN , First Publish Date - 2019-08-31T16:13:00+05:30 IST

అరటిపండ్లు - మూడు, నెయ్యి - మూడు టీస్పూన్లు, పంచదార - అరకప్పు, యాలకులపొడి - చిటికెడు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - కొద్దిగా.

బనానా హల్వా

కావలసినవి
 
అరటిపండ్లు - మూడు, నెయ్యి - మూడు టీస్పూన్లు, పంచదార - అరకప్పు, యాలకులపొడి - చిటికెడు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ముందుగా అరటిపండ్ల తొక్క తీసేయాలి. మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేగించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి అరటిపండు గుజ్జును వేగించాలి. కాసేపు వేగిన తరువాత పంచదార, యాలకులపొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయాలి. ఇంకాసేపు వేగించుకుంటే కొద్దిగా రంగు మారుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని వెడల్పాటి పల్లెంలోకి మార్చుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-31T16:13:00+05:30 IST