బేసన్‌ లడ్డు

ABN , First Publish Date - 2019-08-10T20:47:20+05:30 IST

నెయ్యి - ముప్పావు కప్పు, సెనగపిండి - ఒకకప్పు, పంచదార అరకప్పు, యాలకుల పొడి - అరటీస్పూన్‌.

బేసన్‌ లడ్డు

కావలసినవి
 
నెయ్యి - ముప్పావు కప్పు, సెనగపిండి - ఒకకప్పు, పంచదార అరకప్పు, యాలకుల పొడి - అరటీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌ తీసుకొని నెయ్యి వేసి చిన్నమంటపై వేగించాలి. నెయ్యి వేడెక్కిన తరువాత శనగపిండి వేయాలి. నెమ్మదిగా కలియబెడుతూ చిన్న మంటపై వేగించాలి. సెనగపిండి వేగిన తరువాత ఉండలు లేకుండా, చిక్కటి మిశ్రమంలా అవుతుంది. సెనగపిండి రంగు మారే వరకు వేగించిన తరువాత దింపుకోవాలి. ఇప్పుడు సెనగపిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి కలియబెట్టాలి.
అరచేతిలోకి పిండి తీసుకుంటూ లడ్డూలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి.

Updated Date - 2019-08-10T20:47:20+05:30 IST