పాయసం

ABN , First Publish Date - 2019-04-13T14:34:25+05:30 IST

బాస్మతి బియ్యం - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ తీయని పాలు - ఒక లీటరు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, నెయ్యి - టేబుల్‌స్పూన్‌..

పాయసం

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ తీయని పాలు - ఒక లీటరు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, నెయ్యి - టేబుల్‌స్పూన్‌.
 
తయారుచేయు విధానం
ఒక పాత్ర తీసుకొని నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బాస్మతి బియ్యం వేయాలి.
చిన్నమంటపై బాస్మతి బియ్యంను కాసేపు వేగించాలి. ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను అందులో పోయాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. బియ్యం కాస్త ఉడికిన తరువాత పంచదార వేసుకోవాలి. మిశ్రమం చిక్కగా అవుతుంది. చల్లారితే బాగా చిక్కగా అవుతుంది. కాబట్టి కాస్త పలుచగా ఉన్నప్పుడే దింపుకోవాలి. వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-13T14:34:25+05:30 IST