పాయసం

ABN , First Publish Date - 2019-02-16T21:31:59+05:30 IST

సాములు - 100 గ్రా., బెల్లం - 100 గ్రా., పాలు - 250 మి.లీ., యాలకుల పొడి - 5 గ్రా., జీడిపప్పు - 15 గ్రా., బాదం - 15 గ్రా., నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు...

పాయసం

కావలసిన పదార్థాలు
 
సాములు - 100 గ్రా., బెల్లం - 100 గ్రా., పాలు - 250 మి.లీ., యాలకుల పొడి - 5 గ్రా., జీడిపప్పు - 15 గ్రా., బాదం - 15 గ్రా., నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
 
బాణలిలో నెయ్యు వేసి జీడిపప్పు, బాదం వేయించాలి. ఒక గంట ముందుగా సామలు నానబెట్టాలి. ఒక గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత సామలు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బెల్లం వేసి కలియ తిప్పాలి. పాయసం తయారయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి అలంకరించాలి.
 
పోషక విలువలు: 100 గ్రా.ల ఈ పదార్థంలో శక్తి 386.9 కి. కెలోరీలు, ప్రొటీన్‌ 5.5. గ్రా., కొవ్వు 7.9 గ్రా., కాల్షియం 70.16 మి.గ్రా., భాస్వరం 162.6 మి.గ్రా, ఇనుము 6.02 గ్రా.

Updated Date - 2019-02-16T21:31:59+05:30 IST