ఎగ్‌ డ్రాప్‌ సూప్‌

ABN , First Publish Date - 2018-10-26T23:41:22+05:30 IST

వెజిటెబుల్‌ స్టాక్‌ - 600 మి.లీ., అల్లం - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, సోయా సాస్‌...

ఎగ్‌ డ్రాప్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
వెజిటెబుల్‌ స్టాక్‌ - 600 మి.లీ., అల్లం - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, సోయా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లి కాడల తరుగు - ఒక కప్పు, అనాస పువ్వు - 1, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పనీర్‌ క్యూబ్స్‌ - 350 గ్రా., గుడ్లు - 3, నువ్వుల నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
వెడల్పాటి పాన్‌లో వెజిటెబుల్‌ స్టాక్‌తో పాటు 600 మి.లీ. నీరు పోసి మరిగించాలి. తర్వాత అనాస పువ్వు, అల్లం తరుగు, అరకప్పు ఉల్లికాడల తరుగు, సోయా సాస్‌ వేసి 15 నిమిషాలు మరిగించి వడకట్టాలి. వడకట్టిన మిశ్రమాన్ని చిన్న మంటపై ఉంచి, పనీర్‌ ముక్కలు వేసి 2 నిమిషాల తర్వాత కరిగించిన ఒక టీ స్పూను కార్న్‌ఫ్లోర్‌ కలపాలి. మిగిలిన కార్న్‌ఫ్లోర్‌లో గుడ్లు బాగా గిలకొట్టి మరిగే మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ గుడ్ల సొన గట్టి పడగానే దించేసి మిగిలిన ఉల్లికాడలు, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. నువ్వుల నూనె చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-10-26T23:41:22+05:30 IST