మామిడి ఆవకాయ

కావలసినవి
 
పచ్చిమామిడికాయ ముక్కలు- ఆరు కప్పులు, నూనె- రెండు కప్పులు, ఆవపిండి, కారం-ఒక్కొక్కటీ ఒక్కో కప్పు చొప్పున, రాళ్ల ఉప్పు- ముప్పావుకప్పు+ రెండు టేబుల్‌స్పూన్లు (అదనంగా), మెంతిపొడి లేదా మెంతులు- ఒకటిన్నర టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు- అర కప్పు.
 
తయారీవిధానం
మామిడికాయలను నీటిలో కడిగి పొడి బట్టతో తుడవాలి. తరువాత ముక్కలు చేసి మెత్తటి బట్ట మీద ఆరబెట్టాలి. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి పెట్టుకోవాలి. పొడిగా ఉన్న పాత్రలో కప్పు ఆవపిండి, మెంతి పిండిని పోసి కలపాలి. రాళ్ల ఉప్పును మెత్తగా దంచి ఈ మిశ్రమంలో కలపాలి. కారం, వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో కలపాలి. పొడిగా ఉన్న మరో పాత్రలో ఒకటిన్నర కప్పు నూనె పోయాలి. కొన్ని కొన్ని మామిడి ముక్కలను తీసుకుని నూనెలో ముంచి, తరువాత ఊరగాయ పిండిలో దొర్లించి జాడీలో వేయాలి. అన్ని ముక్కలు వేయడం పూర్తయ్యాక మిగిలిన నూనెను ఊరగాయముక్కల మీద పోసి మెత్తటి బట్టను జాడీకి చుట్టి మూత పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఊరగాయ జాడీ మూత తీసి గరిటెతో బాగా కలపాలి. ఆవకాయను రుచి చూసి ఉప్పు సరిపోలేదనిపిస్తే మరికొంచెం కలపొచ్చు. మర్నాడు ఆవకాయ మీద నూనె పేరుకున్నదీ లేనిదీ గమనించాలి. నూనె తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా నూనె పోయాలి. నూనె, ఉప్పు రెండూ తగిన పాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. ఈ రెండూ సహజమైన ప్రిజర్వేటివ్స్‌గా పనిచేస్తాయి. ఫలితంగా ఊరగాయ సంవత్సరం పైగా పాడవకుండా నిలవ ఉంటుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement