Advertisement
Advertisement
Abn logo
Advertisement

జామ ఊరగాయ

కావలసినవి
 
జామకాయముక్కలు- ఒక కప్పు, ఆవాలు, జీలకర్ర,- ఒక్కోటి ఒక్కో టీస్పూను చొప్పున, మెంతులు- అర టీస్పూను, వేరుశెనగ నూనె-తగినంత, ఎండుమిర్చి-మూడు, కరివేపాకు- కొద్దిగా, ఇంగువ-చిటికెడు, చింతపండు గుజ్జు- అర కప్పు, పచ్చిమిర్చి (తరుగు)-మూడు, చక్కెర, పసుపు - ఒక్కో టీస్పూను చొప్పున, ఉప్పు- తగినంత, కారం- ఒక టేబుల్‌స్పూను, నిమ్మకాయ- ఒకటి (ముక్కలు తరిగి).
 
తయారీ విధానం
 
ఆవాలు, జీలకర్ర, మెంతులను రెండు నిమిషాలపాటు కళాయిలో నూనె లేకుండా వేగించాలి. ఇవి చల్లారాక మిక్సీలో గ్రైండ్‌చేయాలి. ఒక పాన్‌లో వేరుశెనగనూనె పోసి అది వేడెక్కాక ఎండుమిర్చి, కరివేపాకు, జామకాయముక్కలు, ఇంగువ వేసి వేగించాలి. ఆ తర్వాత అందులోనే చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. దాని తర్వాత అందులో చక్కెర, పసుపు, ఉప్పు, కారాలు కూడా కలిపి మరికొంతసేపు ఉడికించాలి. చివరిగా మిక్సీ పట్టిన పొడిని వేసి మరికొద్దిసేపు (మూడునిమిషాలు) ఉడికించాలి. అంతే...నోరూరించే జామ ఊరగాయ రెడీ...

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement