జామ, పుదీనా చట్నీ

ABN , First Publish Date - 2018-01-27T22:14:39+05:30 IST

దోరగా పండిన జామకాయ - 1, పచ్చిమిర్చి - 3, పుదీనా - 1 కట్ట, టమాటా - 1, నిమ్మరసం - తగినంత...

జామ, పుదీనా చట్నీ

కావలసిన పదార్థాలు
 
దోరగా పండిన జామకాయ - 1, పచ్చిమిర్చి - 3, పుదీనా - 1 కట్ట, టమాటా - 1, నిమ్మరసం - తగినంత, ఉప్పు రుచికి సరిపడా, నూనె - 2 టీ స్పూన్లు, (తాలింపు కోసం) మినప్పప్పు- 1/2 టీ స్పూను, ఆవాలు - 1/4 టీ స్పూను, జీలకర్ర - 1/4 టీ స్పూను, పసుపు - చిటికెడు, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి మగ్గనిచ్చి దించేయండి. చల్లారిన తర్వాత వీటితో పాటుగా జామ ముక్కలు, పుదీనా ఆకులు, ఉప్పు కలిపి మిక్సీలో రుబ్బండి. మిగిలిన నూనెలో తాలింపు వేగించి పచ్చడిలో కలపండి. మంట ఆపేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశలాంటి టిఫిన్స్‌లో మాత్రమే కాకుండా అన్నంలో కలుపుకున్నా, శాండ్‌విచ్‌ పైన
వేసుకున్నా రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-01-27T22:14:39+05:30 IST