క్యారెట్‌ ముక్కల పచ్చడి

ABN , First Publish Date - 2017-12-09T22:30:55+05:30 IST

క్యారెట్‌ - పావు కిలో, ఆవ పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, కారం, ఉప్పు - ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఆవ నూనె - అర కప్పు....

క్యారెట్‌ ముక్కల పచ్చడి

కావలసినవి
క్యారెట్‌ - పావు కిలో, ఆవ పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, కారం, ఉప్పు - ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఆవ నూనె - అర కప్పు.
 
తయారీ విధానం
క్యారెట్స్‌ తొక్కను పీల్‌ చేయాలి. తరువాత వాటిని నిలువుగా తరగాలి. పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తరిగిన క్యారెట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత శుభ్రమైన గాజు సీసాలోకి తీసి మూత పెట్టాలి. ఈ సీసాను రెండు రోజులు ఎండలో ఉంచాలి. అలా ఉంచినప్పుడు రోజుకి ఒకసారి పచ్చడిని తడిలేని గరిటెతో కదపాలి. తరువాత ఫ్రిజ్‌లో ఉంచితే ఈ పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. ఇందులో నిలువుగా తరిగిన పచ్చి మిర్చిని కూడా వేసుకోవచ్చు. శీతాకాలంలో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2017-12-09T22:30:55+05:30 IST