మటన్‌ బోన్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-11-18T21:21:42+05:30 IST

కరివేపాకు - 1 రెమ్మ, టమోటా ముక్కలు - అర కప్పు, లేత మటన్‌ బోన్స్‌ - పావు కిలో, పుదీనా - 1 కట్ట..

మటన్‌ బోన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
కరివేపాకు - 1 రెమ్మ, టమోటా ముక్కలు - అర కప్పు, లేత మటన్‌ బోన్స్‌ - పావు కిలో, పుదీనా - 1 కట్ట, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - 3, మిరియాలు - పావు టీస్పూను, ధనియాలు - 1 టీస్పూను, సోంపు - 1 టీస్పూను, అల్లం - 2 ముక్కలు, వెల్లుల్లి - 6 రెబ్బలు, జీలకర్ర - అర టీస్పూను.
 
తయారీ విధానం
ముందుగా మటన్‌ బోన్స్‌ను ఎక్కువ నీళ్లలో గంటపాటు ఉడకబెట్టాలి. పాన్‌లో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, అల్లం, వెల్లుల్లి నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. మటన్‌ బోన్స్‌కు టమోటాలు, కరివేపాకు, పుదీనా, ఉప్పు కలిపి, మసాలా పొడి కూడా కలిపి, మూత ఉంచి టమోటాలు మెత్తబడేవరకూ ఉడికించాలి. తీసి వేడి వేడిగా బౌల్స్‌లో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-11-18T21:21:42+05:30 IST