ఉసిరి పచ్చి పచ్చడి

ABN , First Publish Date - 2017-11-04T13:31:30+05:30 IST

కొత్తిమీర, ఉసిరి - ఒక్కొక్కటి 200 గ్రాములు, పచ్చి మిరపకాయలు-100 గ్రాములు...

ఉసిరి పచ్చి పచ్చడి

కావలసినవి
కొత్తిమీర, ఉసిరి - ఒక్కొక్కటి 200 గ్రాములు, పచ్చిమిరపకాయలు-100 గ్రాములు, అల్లం-చిన్నముక్క, ఉప్పు- ఒక టీస్పూను.
 
తయారీ
కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. ఉసిరికాయల్లోని గింజలు తీసేసి వాటిని చిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిరపకాయలు, అల్లంలను సన్నగా తరిగిపెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటికీ ఒకేసారి మిక్సర్‌లో వేసి మెత్తగా చేయాలి. అంతే ఉసిరిపచ్చడి రెడీ.

Updated Date - 2017-11-04T13:31:30+05:30 IST