కందగడ్డ పచ్చడి

ABN , First Publish Date - 2017-10-14T22:27:01+05:30 IST

కంద - పావు కిలో, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి..

కందగడ్డ పచ్చడి

కావలసిన పదార్థాలు
కంద - పావు కిలో, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 3, పసుపు - పావు టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, ఆవపొడి, వాము -అర టీ స్పూను చొప్పున, ఇంగువ - పావు టీ స్పూను, ఆవ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, కొత్తిమీర - అలంకరణకు.
 
తయారుచేసే విధానం
శుభ్రం చేసిన కందను ముక్కలుగా తరిగి, పావుకప్పు నీరు, చిటికెడు పసుపు వేసి కుక్కర్లో 4 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి చల్లారిన తర్వాత మెదిపి ఉంచాలి. ఒక చిన్న మూకుడులో ఆవ నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత మంట తీసేసి, వెంటనే వాము, ఆవ పొడి, కారం, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువ వేయాలి. నిమిషం తర్వాత పోపుతో పాటు ఉప్పు, నిమ్మరసం కంద గుజ్జులో వేసి బాగా కలపాలి. ఈ చట్నీని రెండు రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి, తినేముందు ఉల్లి, కొత్తిమీర తరుగు కలుపుకుంటే బాగుంటుంది.

Updated Date - 2017-10-14T22:27:01+05:30 IST