కజ్జి కాయలు

ABN , First Publish Date - 2017-09-23T23:28:14+05:30 IST

మైదా - ఒక కప్పు, బొంబాయి రవ్వ - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - చిటికెడు..

కజ్జి కాయలు

కావలసిన పదార్థాలు
 
మైదా - ఒక కప్పు, బొంబాయి రవ్వ - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - చిటికెడు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, పంచదార పొడి - అరకప్పు, వేగించిన జీడిపప్పు పలుకులు - 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార - అరకప్పు, గసగసాలు - ఒక టీ స్పూను, యాలకుల పొడి - పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
ఒక పాత్రలో మైదా, ఉప్పు, ఒక టేబుల్‌ స్పూను నెయ్యి వేసి తగినన్ని నీళ్లతో పూరీ పిండిలా కలిపి పక్కనుంచాలి. మిగతా నెయ్యిలో జీడిపప్పు, గసగసాలు ఒక నిమిషం పాటు వేగించి తీసెయ్యాలి. తర్వాత ఎండు కొబ్బరి తురుము రెండు నిమిషాలు (మాడకుండా) వేగించాలి. ఒక వెడల్పాటి పళ్లెంలో వేగించిన పదార్థాలతో పాటు పంచదార, యాలకుల పొడులు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని పూరీల్లా చేసుకుని సరిపడా కొబ్బరి మిశ్రమం మధ్యలో పెట్టి అర్ధచంద్రాకారంలో మడవాలి. మిశ్రమం బయటకి రాకుండా అంచులు వత్తి నూనెలో దోరగా వేగించాలి.

Updated Date - 2017-09-23T23:28:14+05:30 IST