శెనగపిండి లడ్డు

ABN , First Publish Date - 2017-09-23T19:15:10+05:30 IST

నెయ్యి-200 గ్రాములు, శెనగపిండి-350 గ్రాములు, కేస్టర్‌ షుగర్‌- 175 గ్రాములు, ఏలకుల పొడి...

శెనగపిండి లడ్డు

కావలసిన పదార్థాలు
 
నెయ్యి-200 గ్రాములు, శెనగపిండి-350 గ్రాములు, కేస్టర్‌ షుగర్‌- 175 గ్రాములు, ఏలకుల పొడి- టీస్పూను, డ్రైఫ్రూట్స్‌- 2 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు-1/4 టీస్పూను (ఒక టేబుల్‌స్పూను నీటిలో దీన్ని నానబెట్టాలి).
 
తయారీ విధానం
 
పెద్ద ప్యాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి బాగా వేడిచేయాలి. దాంట్లో శెనగపిండి వేసి చిన్న మంట మీద ఆ మిశ్రమాన్ని కలుపుతుండాలి. శెనగపిండి రంగు మారిన తర్వాత దాన్ని స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. తర్వాత అందులో చక్కెర, సుగంధద్రవ్యాలు, డ్రైఫ్రూట్లు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. తర్వాత చేతులను తడిచేసుకుని ఆ మిశ్రమాన్ని సమమైన పరిమాణంలో ఉండల్లా చుట్టి వాటిపై మరికొన్ని డ్రైఫ్రూటు ముక్కలు చల్లాలి. దీని రుచి మధురం.

Updated Date - 2017-09-23T19:15:10+05:30 IST