అరటికాయ పాన్ కేక్స్
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటి - ఒకటి, మైదా - ఒకటిన్నర కప్పులు, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - రెండున్నర టీ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, పాలు - ఒక కప్పు, గుడ్లు - 2, వెనీల ఎస్సెన్స్ -అర టీ స్పూను, బటర్ - 3 టేబుల్ స్పూన్లు, నూనె - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం
ఒక పాత్రలో మైదా, పంచదార, బేకింగ్ సోడా, ఉప్పు వేసి చక్కగా కలపాలి. మరో పాత్రలో గుడ్లు, పాలు, వెనీలా ఎస్సెన్స్ వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు మైదా మిశ్రమం, గుడ్ల మిశ్రమం, అరటి గుజ్జు, బటర్ - అంతా ఒకే పాత్రలో వేసి జారుగా కలపాలి. ఈ
మిశ్రమాన్ని నూనె రాసిన నాన్‌స్టిక్ పెనంపై దళసరిగా దోశల్లా పోసి రెండు వైపులా
కాల్చుకోవాలి. ఇవి తేనెలో అద్దుకుని తింటే బాగుంటాయి.