Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంజాబీ చికెన్‌ పికిల్‌

కావాల్సిన పదార్థాలు: చికెన్‌ - కిలో (ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కోసుకోవాలి), అల్లం పేస్ట్‌ - 50 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు, కారం - 100 గ్రాములు, పసుపు - 5 గ్రాములు, ఆవనూనె - 800 మి.లీటర్లు, ఇంగువ - 2 గ్రాములు, ఉల్లి ముక్కలు - 200 గ్రాములు, యాలకుల పొడి - 5 గ్రాములు, సోంపు - 20 గ్రాములు, నల్ల జీలకర్ర - 10 గ్రాములు, మెంతులు - 5 గ్రాములు, ఆవాలు - 10 గ్రా, వెనిగర్‌ - 400 మి.లీటర్లు
 
తయారీ: చికెన్‌ ముక్కలకు కారం, పసుపు, ఉప్పు పట్టించాలి. అల్లం, వెల్లుల్లి ముద్దల్లో చెరో సగం తీసుకుని చికెన్‌లో కలిపి అరగంటపాటు నానబెట్టాలి. బాండీలో నూనె వేసి పొగలొచ్చేలా వేడయ్యాక చికెన్‌ వేసి 2 - 3 నిమిషాలపాటు వేయించి తీసేయాలి. అదే నూనెలో ఇంగువ, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. మిగిలిన మసాలాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి నిమిషంపాటు వేగించాలి. తర్వాత వెనిగర్‌ వేసి తెర్లనివ్వాలి. తర్వాత చికెన్‌ వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు వేగించి స్టవ్‌ ఆపేయాలి. పికిల్‌ పూర్తిగా చల్లారాక జాడీలో నిల్వ చేసుకోవాలి.

ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం చైర్మన్‌ గురిపై గురికుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలిఆదివాసీలు దేవతలకు పూజలుఫిబ్రవరి 20న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికకాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం
Advertisement