మామిడి పచ్చడి

ABN , First Publish Date - 2017-04-22T21:37:56+05:30 IST

కావాల్సిన పదార్థాలు మామిడికాయలు:3-4 కొబ్బరితురుము-1/4

మామిడి పచ్చడి

కావాల్సిన పదార్థాలు
 
మామిడికాయలు:3-4
కొబ్బరితురుము-1/4
పెరుగు-1/2 (కొద్దిగా పలచగా ఉండాలి)
పచ్చిమిరపకాయలు, ఉప్పు- తగినంత
నూనె-1 టీస్పూను
ఆవాలు- 1/2 టీస్పూను

కావాల్సిన పదార్థాలు
 
మామిడికాయలను శుభ్రంగా కడగాలి. వాటి అంచులను తీసేసి పొడుగు ముక్కలుగా తరగాలి. మామిడికాయ లోపల ఉండే విత్తును కూడా తీసేయాలి. పచ్చిమిరపకాయలు, మామిడిముక్కలను రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుములో వేసి బాగా బ్లెండ్‌ చేయాలి. తర్వాత అందులో పెరుగు వేసి మరోసారి బ్లెండర్‌లో బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని వేరే గిన్నెలో పోయాలి. ఆ పచ్చడి మీద ఆవాల తాలింపు వేయాలి. పచ్చడి పలచగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. అన్నంలో సాంబార్‌లేదా దాల్‌తో దీన్ని తింటే ఎంతో బాగుంటుంది. 

Updated Date - 2017-04-22T21:37:56+05:30 IST