Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుజరాతీ కఢీ

కఢీకి కావాల్సిన పదార్థాలు
తాజా పెరుగు - ఒక కప్పు, నీళ్లు - రెండున్నర కప్పులు, శెనగపిండి - రెండున్నర టేబుల్‌ స్పూన్లు, అల్లం - పచ్చిమిర్చి పేస్ట్‌ - అరటేబుల్‌ స్పూన్‌ లేదా చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి, పంచదార లేదా బెల్లం - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అలంకరణకు.
 
తాలింపునకు కావలసినవి: దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - రెండు, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - రెండు, జీలకర్ర, ఆవాలు - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, మెంతులు - పావు టీస్పూన్‌, నూనె లేదా నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌.
 
తయారీ విధానం
శెనగపిండి, అల్లం - పచ్చిమిర్చి పేస్ట్‌, పెరుగు, పంచదార, ఉప్పు వేసి, నీళ్లు పోసి బాగా కలిపి మెత్తటి పేస్ట్‌లా చేయాలి.
తాలింపుకు కావలసిన పదార్థాలన్నింటినీ వేగించాలి.
పెరుగలో శెనగపిండి మిశ్రమాన్ని కలిపి ఉడికించాలి.
ఉడుకు పట్టాక, మంటను తగ్గించి, మరో ఐదు నిమిషాలు స్టవ్‌ మీదే ఉంచాలి.
ఉండలు ఏర్పడకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించిన ఈ కఢీని అన్నంతో కానీ పుల్కాతో కానీ తింటే బాగుంటుంది.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement