మామిడి రసం

ABN , First Publish Date - 2017-03-18T20:43:34+05:30 IST

పెరట్లో మామిడి పిందెలు కనిపిస్తే చేతులూరుకుంటాయా? చటుక్కున తెంపి బద్దలుగా కోసుకుని ఉప్పు, కారం చల్లుకుని పిల్లా, పెద్దా అందరం తినేస్తాం!

మామిడి రసం

పెరట్లో మామిడి పిందెలు కనిపిస్తే చేతులూరుకుంటాయా? చటుక్కున తెంపి
బద్దలుగా కోసుకుని ఉప్పు, కారం చల్లుకుని పిల్లా, పెద్దా అందరం తినేస్తాం! అయితే పుల్లపుల్లని పచ్చి మామిడిని మరెన్నో వెరైటీ రుచుల్లో తినొచ్చు. ఆ ‘రా’ మామిడితో ఆరారగా తినేయండి.
 
కావాల్సిన పదార్థాలు
పచ్చి మిర్చి - 4, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు
నూనె - తగినంత, నీళ్లు- 3 గ్లాసులు, కందిపప్పు- 1 కప్పు మామిడి కాయ - 1, చారు మసాలా- 2 టీస్పూన్లు (మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కలిసిన పొడి), ఆవాలు, మినప్పప్పు
జీలకర్ర - చెరొక అర స్పూను, పసుపు - చిటికెడు
బెల్లం తరుగు - 1 టీస్పూను
కొత్తిమీర- 1 కట్ట
 
 
తయారీ విధానం
పప్పు కడిగి, మామిడి ముక్కలు, రెండు కప్పుల నీళ్లు పోసి 5 విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి.
పప్పు ఉడికాక మెత్తగా మెదిపి పెట్టుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో నూనె పోసి కాగబెట్టాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
అవి చిటపటలాడాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తర్వాత 3 కప్పుల నీళ్లు పోసి పసుపు, బెల్లం తరుగు, ఉప్పు, రుబ్బిన పప్పు పోసి ఉడికించాలి.
తర్వాత చారు మసాలా వేసి 2 నిమిషాలు తెర్లనివ్వాలి.
చివర్లో కొత్తిమీర చల్లి దింపేయాలి.

Updated Date - 2017-03-18T20:43:34+05:30 IST