సరస్వతి ఆకు చట్నీ

ABN , First Publish Date - 2017-03-04T15:11:31+05:30 IST

సరస్వతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. కుష్టు, క్షయ వ్యాధి

సరస్వతి ఆకు చట్నీ

మెదడుకి వయసు రానీయని.. సరస్వతి ఆకు
సరస్వతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. కుష్టు, క్షయ వ్యాధి చికిత్సలో కూడా వీటిని వాడతారు. ఈ మొక్క సారాన్ని చైనీయులు వైద్యంలో మెదడుకి టానిక్‌లా ఉపయోగిస్తారు. ఒత్తిడి, డిప్రెషన్‌ల నుంచి బయటపడేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. దీన్లో ఉండే సూక్ష్మపోషకాలు వయసు ప్రభావం మెదడు మీద పడకుండా చేస్తాయి. ఏకాగ్రతను పెంచి, మెదడుకి శక్తినిస్తాయి. సరస్వతి ఆకు వాడడం వల్ల మానసిక వైకల్యంతో బాధపడే పిల్లల్లో మార్పు వస్తుందనే విషయం పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఆకు గురించి ఇప్పటివరకు ప్రతికూలంగా ఎటువంటి ఫలితాలూ లేనప్పటికీ. గర్భిణులు వాడితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కొలెస్ర్టాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిక్‌, అధిక కొలెస్ర్టాల్‌ సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు వాడకపోవడం ఉత్తమం.
సరస్వతి ఆకు చట్నీ
 
కావలసినవి పదార్థాలు
సరస్వతాకులు - వందగ్రాములు, నూనె - ఒక టీ స్పూన్‌, ఇంగువ - చిటికెడు, సోంపు, మెంతులు - కలిపి ఐదు గ్రాములు, ఎండుమిర్చి - ఐదు, కరివేపాకులు - కొన్ని, చింతపండు (గింజలు తీసిన) - ఐదు గ్రాములు, ఉప్పు, పంచదార - రుచికి తగినంత.
తయారీవిధానం
పాన్‌లో నూనె వేడిచేసి ఇంగువ వేగించాక మెంతులు, సోంపు, ఎండుమిర్చి తునకలు, కరివేపాకులు వేయాలి. అవి రంగు మారేవరకు వేగించి, స్టవ్‌ మీద నుంచి పాన్‌ దింపేయాలి. తరువాత సరస్వతి ఆకులు, చింతపండు, పంచదార, ఉప్పు వేసి అన్నింటినీ కలిపి, మిక్సీజార్‌లో వేసి గ్రైండ్‌ చేయాలి. అవసరమయితే మధ్యలో అర స్పూన్‌ గోరు వెచ్చటి నీళ్లు కలపొచ్చు. భోజనంలో ఈ చట్నీని చేరిస్తే ఆ టేస్టే వేరు.

Updated Date - 2017-03-04T15:11:31+05:30 IST