Advertisement
Advertisement
Abn logo
Advertisement

మటన్‌ పులుసు

కావాల్సిన పదార్థాలు:
మాంసం - పావు కిలో, ధనియాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, ఎండుమిర్చి - పది, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి - ఒకటి, ఉప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు - చిటికెడు, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క - ఒక్కోటి రెండు చొప్పున.
 
తయారీ విధానం: 
పాన్‌లో నూనె వేడిచేసి మిర్చి, ధనియాలు వేగించాలి. మిర్చి నల్లబడకుండా చూడాలి. అవి వేగాక వాటితో పాటు అల్లం వెల్లుల్లి వేసి మిక్సీలో మెత్తగా నూరాలి. ఉల్లిపాయ సన్నగా తరగాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె, నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లి తరుగులను దోరగా వేగించాలి. తరువాత మాంసం వేసి నీరు పోయే వరకు ఇగరనివ్వాలి. ఇందుకు దాదాపు పదినిమిషాలు పడుతుంది. ఆ తరువాత నూరిన ముద్ద, ఉప్పు, పసుపు వేసి కలిపి కాసేపు వేగించాలి. తరువాత రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. ఆ నీరు ముప్పావు గ్లాసుకి వచ్చే వరకు ఉండి పైపైన కొత్తిమీర చల్లాలి. ఇందులో నిమ్మకాయ లేదా చింతపండు వంటివి వెయ్యకూడదు. కావాలనుకుంటే ఉల్లిపాయలు వేగించేటప్పుడే ఒక టొమాటో కోసి వేసుకోవచ్చు.

ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం చైర్మన్‌ గురిపై గురికుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలిఆదివాసీలు దేవతలకు పూజలుఫిబ్రవరి 20న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికకాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం
Advertisement