పాల్‌ పాయసం

ABN , First Publish Date - 2016-09-10T18:47:33+05:30 IST

పాలు - పావు లీటరు, బియ్యం - 30 గ్రా, పంచదార - 80 గ్రా , జీడిపప్పు, బాదం - 20 గ్రా, యాలకుల పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - చిటికెడు, నెయ్యి - 10 గ్రా

పాల్‌ పాయసం

కావలసిన పదార్థాలు: పాలు - పావు లీటరు, బియ్యం - 30 గ్రా, పంచదార - 80 గ్రా , జీడిపప్పు, బాదం - 20 గ్రా, యాలకుల పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - చిటికెడు, నెయ్యి - 10 గ్రా

 
తయారీ విధానం:
బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేయించి తీయాలి.
తర్వాత బియ్యం వేసి వేయించి చల్లారాక పలుకుగా దంచుకోవాలి.
పాలు కాచి బియ్యం పలుకులు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
పంచదార వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
చివర్లో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు చల్లి వడ్డించాలి.

Updated Date - 2016-09-10T18:47:33+05:30 IST