చిలగడదుంప పూరీ

ABN , First Publish Date - 2016-08-03T16:07:50+05:30 IST

కావలసిన పదార్ధాలు: చిలగడదుంపలు - పావుకిలో ( ఉడికించి తొక్కతీసి బాగా మెదపాలి), బెల్లం తురుము - పావుకప్పు, గోధుమపిండి -

చిలగడదుంప పూరీ

కావలసిన పదార్ధాలు: చిలగడదుంపలు - పావుకిలో ( ఉడికించి తొక్కతీసి బాగా మెదపాలి), బెల్లం తురుము - పావుకప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, యాలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత
తయారీ పద్ధతి:  ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి కరిగించి వడకట్టాలి. అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప ముద్ద, యాలకుల పొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి. తగినంత నీరు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీయాలి. తియ్యతియ్యని చిలగడదుంప పూరీలు రెడీ.

Updated Date - 2016-08-03T16:07:50+05:30 IST