మామిడి తొక్కు నిల్వ పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడికాయ- 1, పసుపు- 1/4 టీ స్పూను, ఎండుమిర్చి- 5, బెల్లం తురుము- 1/2 టీ స్పూను, ఉప్పు- 1/2 టీ స్పూను, వేగించిన మెంతుల పొడి- 1/2 టీ స్పూను, నువ్వుల నూనె- 1/2 కప్పు, ఆవాలు- 1/2 టీ స్పూను, ఇంగువ- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా
 
తయారీ విధానం: మామిడికాయ చెక్కుతీసి, చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. తరువాత ఒక బాణలిలో ఎండుమిర్చిని రెండు నిమిషాలపాటు నూనె లేకుండా వేగించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిచేయాలి. తరువాత మామిడి ముక్కలు, పసుపు కూడా వేసి కచ్చాపచ్చాగా(మెత్తగా కాకుండా) రుబ్బుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఇంగువ వేగించాక మామిడి తొక్కు వేసి సన్నని మంట మీద కలుపుతూ వేగించాలి. నూనె తేలుతున్నప్పుడు మెంతిపిండి వేసి బాగా కలిపి మరో నిమిషం ఉడికించాలి. ఆ తరువాత బెల్లం, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించాక దింపేయాలి. ఇది ఆరు నెలలపాటు నిలువ ఉంటుంది.

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement