పచ్చి మామిడి- పెసర పచ్చడి

ABN , First Publish Date - 2016-04-28T19:54:00+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు- 1/2 కప్పు, మామిడి తురుము- 3/4 కప్పు, ఎండుమిర్చి- 5, జీలకర్ర- 1/2 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 3 టీ స్పూన్లు, తాలింపు దినుసులు- 1 టీ స్పూను

పచ్చి మామిడి- పెసర పచ్చడి

కావలసిన పదార్థాలు: పెసరపప్పు- 1/2 కప్పు, మామిడి తురుము- 3/4 కప్పు, ఎండుమిర్చి- 5, జీలకర్ర- 1/2 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 3 టీ స్పూన్లు, తాలింపు దినుసులు- 1 టీ స్పూను
 
తయారీ విధానం: ఒక బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి, పెసరపప్పును దోరగా వేగించి తీయాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్రలను కూడా వేగించాలి. ఆ తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. చివర్లో తాలింపు పెట్టుకోవాలి. ఇది వారం రోజులపాటు తాజాగా ఉంటుంది.

Updated Date - 2016-04-28T19:54:00+05:30 IST