Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పచ్చిమామిడి- తెల్ల శెనగల పచ్చడి

పచ్చిమామిడి- తెల్ల శెనగల పచ్చడి

v>కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము- 3 కప్పులు, కాబూలీ శెనగలు- 1/2 కప్పు, పసుపు- 1 టీ స్పూను, కారం- 2 టేబుల్‌ స్పూన్లు, వేగించిన మెంతులు- 1/2 టీ స్పూను, మెంతిపొడి- 1 టేబుల్‌ స్పూను, ఆవపిండి- 3/4 టేబుల్‌ స్పూను, వేగించిన జీలకర్ర- 1/2 టీ స్పూను, ఎండుమిర్చి- 6, ఉప్పు- 2 టేబుల్‌ స్పూన్లు, ఆవనూనె- 4 కప్పులు .
 
తయారీ విధానం: ఒక పాత్రలో మామిడి తురుము, పసుపు, ఉప్పు వేసి రెండు గంటలు ఉంచాలి. తరువాత మామిడి తురుమును గట్టిగా పిండి, వచ్చిన నీటిని ఒక పాత్రలోకి పట్టాలి. ఆ నీటిలో మెంతులు, శెనగలు వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. తురుమును ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. తరువాతి రోజు మామిడి తురుములో కారం, మెంతిపొడి, ఆవపిండి, వేగించిన జీలకర్ర, ఎండుమిర్చి, నానబెట్టిన మెంతులు, శెనగలను కూడా వేసి బాగా కలపాలి. ఆ తరువాత నూనె మరిగించి, చల్లార్చి ఈ మిశ్రమంలో పోయాలి. ఈ పచ్చడిని గాజు సీసాలోకి తీసి వారం రోజులపాటు రోజూ రెండుమూడు గంటలు ఎండలో పెట్టి ఆ తరువాత వాడుకోవచ్చు. ఈ పచ్చడి దాదాపు సంవత్సరం నిలువ ఉంటుంది.

నిర్మల్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలకు బ్రేక్‌ నిర్మల్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలకు బ్రేక్‌ రైతులు  ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంశాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యం..!జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యం..!అధికారులు సమన్వయంతో పనిచేయాలిఅధికారులు సమన్వయంతో పనిచేయాలిపల్లెప్రగతిని బహిష్కరిస్తాం: సర్పంచులుపల్లెప్రగతిని బహిష్కరిస్తాం: సర్పంచులుపల్లెప్రగతిని విజయవంతం చేయాలిపల్లెప్రగతిని విజయవంతం చేయాలివామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోవామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.