దొండకాయ పచ్చడి

ABN , First Publish Date - 2015-12-01T20:36:18+05:30 IST

కావాల్సినపదార్థాలు: దొండకాయలు - పావుకిలో, పచ్చిమిరపకాయలు - ఆరు, చింతపండు - కొద్దిగా, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండు మిరపకాయలు - నాలుగు

దొండకాయ పచ్చడి

కావాల్సినపదార్థాలు: దొండకాయలు - పావుకిలో, పచ్చిమిరపకాయలు - ఆరు, చింతపండు - కొద్దిగా, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండు మిరపకాయలు - నాలుగు, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, మినపప్పు - ఒక టేబుల్‌ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, శెనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయంచుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా దగ్గరగా అయ్యే వరకూ వేయించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో కొద్దిగా ముక్కలు ఉండేటట్టు రుబ్బుకోవాలి. తరువాత మినపప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవాలి.

Updated Date - 2015-12-01T20:36:18+05:30 IST