చింతకాయ-కొబ్బరి చట్నీ

ABN , First Publish Date - 2015-12-01T20:28:03+05:30 IST

కావాల్సిన పదార్థాలు: చింతకాయముక్కలు - అర కప్పు, కొబ్బరి కాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, పుట్నాలు - ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను

చింతకాయ-కొబ్బరి చట్నీ

కావాల్సిన పదార్థాలు: చింతకాయముక్కలు - అర కప్పు, కొబ్బరి కాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, పుట్నాలు - ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా చింతకాయలపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో చింతకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె కొద్దిగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రుబ్బిన పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోసెల్లోకి చాలా బాగుంటుంది.

Updated Date - 2015-12-01T20:28:03+05:30 IST