Abn logo

గోబీ మంచూరియా

కావలసిన పదార్థాలు: మైదా: కప్పు, కాలీ ఫ్లవర్‌: ఒకటి, మొక్కజొన్న పిండి: పావుకప్పు, మిరియాల పొడి: అర స్పూను, నూనె తగినంత, టమోటాసాస్‌: మూడు టేబుల్‌ స్పూన్లు, చిల్లి గార్లిక్‌ సాస్‌: మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌: అర టేబుల్‌ స్పూను, వెనిగర్‌: టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు, ఉల్లి ఆకులు: పావు కప్పు, అల్లం ముక్కలు: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు: స్పూను, చక్కెర: టేబుల్‌ స్పూను,
తయారీ విధానం: ముందుగా పెద్ద గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి నీరు పోసి గంటె జారుగా కలుపుకోవాలి. మరొక బాండీని తీసుకుని నూనె పోసి కాగిన తరువాత కాలీఫ్లవర్‌ ముక్కలను పై మిశ్రమంలో ముంచి పకోడీల మాదిరిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి ఆకులు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత సాస్‌లు అన్నీ కూడా వేసుకోవాలి. ఈ సాస్‌లు ఉడుకుతున్న సమయంలో స్పూను మొక్కజొన్న పిండిని నీటిలో కలిపి దీనికి జత చేయాలి. అన్నీ కలిపి వుడుకుతున్న సమయంలోనే వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలను జత చేసుకోవాలి. పెద్ద మంట మీద పది నిమిషాల పాటు ఉడకనిచ్చి కిందకు దించేయాలి. దించేసే ముందు కొత్తిమీర ఆకులు చల్లుకోవాలి.

మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
Advertisement
Advertisement