రాడిష్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:49:54+05:30 IST

కావలసిన పదార్థాలు: రాడిష్‌ దుంపలు - 2, వెల్లుల్లి - 4 రేకలు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు

రాడిష్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: రాడిష్‌ దుంపలు - 2, వెల్లుల్లి - 4 రేకలు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - చిటికెడు, వెన్న - 2 టీ స్పూన్లు, కార్న్‌ప్లోర్‌ - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాడిష్‌, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వెన్నలో వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేగించి రాడిష్‌ ముక్కలు, పసుపు కలపాలి. రెండు నిమిషాల తర్వాత 4 కప్పుల నీరుపోసి మూతపెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి. నీటిని వడకట్టి ముక్కల్ని వేరుచేయాలి. విడిగా పావు కప్పు నీటిలో కార్న్‌ఫ్లోర్‌ ఉండలు లేకుండా కలిపి వార్చిన నీటిలో పోసి మరికొంతసేపు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి దించేయాలి. తాగేముందు ఉడికిన రాడిష్‌ ముక్కల్ని వేసుకోవాలి.

Updated Date - 2015-09-02T22:49:54+05:30 IST