ముల్లంగి పరాటాలు

ABN , First Publish Date - 2015-09-02T21:46:01+05:30 IST

కావలసిన పదార్థాలు : గోఽధుమపిండి - 1 కప్పు, మైదా - 1 కప్పు, వాము - అర టీ స్పూను, ఉప్పు

ముల్లంగి పరాటాలు

కావలసిన పదార్థాలు : గోఽధుమపిండి - 1 కప్పు, మైదా - 1 కప్పు, వాము - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, నూనె/ నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, ముల్లంగి (ఆకుతో పాటు) - 1
తయారుచేసే విధానం: ముల్లంగిని శభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక పాత్రలో ముల్లంగి తురుము, ఉప్పు, వాము,1 టేబుల్‌ స్పూను నెయ్యి, గోధుమపిండి, మైదా వేసి తగినంత నీరు జతచేస్తూ పరాటా పిండిలా కలుపుకోవాలి. దీన్ని అరగంటపాటు నాననివ్వాలి. తర్వాత మీకిష్టమైన ఆకారాల్లో పరాటాల్ని చేసుకుని పెనంపైన రెండువైపులా నేతితో దోరగా కాల్చుకోవాలి.

Updated Date - 2015-09-02T21:46:01+05:30 IST