నువ్వుల రొట్టెలు

ABN , First Publish Date - 2015-09-02T21:47:07+05:30 IST

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - 1 కప్పు, నీరు

నువ్వుల రొట్టెలు

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - 1 కప్పు, నీరు - తగినంత. బియ్యప్పిండి - పిడికెడు.
తయారుచేసే విధానం: ఒక గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండి తీసుకుని అందులో ఉప్పు జతచేసి వేడి చేసిన నీటిని కలుపుతూ గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి. పిండిని 4 సమభాగాలుగా చేసి అరచేత్తో పూరీసైజుకు ఒత్తి రెండు వైపులా నువ్వుల్లో అద్దాలి. ఇప్పుడు రొట్టెలపీట లేదా నాపరాయిపైన పొడి(జొన్న)పిండి చల్లుతూ అరచేత్తో మెల్లగా ఒత్తుతూ గుండ్రంగా విశాలంగా చేయాలి. దీన్ని పెనంపైన జాగ్రత్తగా విరగకుండా వేసి నీరు తడిపిన గుడ్డతో ఒకసారి రొట్టె పైపైన తుడవాలి. (అంటిన పొడిపిండి పోవడానికి) ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి అదేమాదిరి తడిగుడ్డతో తుడవాలి. ఇలా అటూ ఇటూ తిప్పుతూ రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి.

Updated Date - 2015-09-02T21:47:07+05:30 IST