తోటకూర పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:50:56+05:30 IST

కావలసిన పదార్థాలు: తోటకూర (లావు) కాడలు - 2 కప్పులు, తోటకూర తరుగు - 1 కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి

తోటకూర పులుసు

కావలసిన పదార్థాలు: తోటకూర (లావు) కాడలు - 2 కప్పులు, తోటకూర తరుగు - 1 కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 3, శనగపిండి - అర టేబుల్‌ స్పూను, నీరు - 3 కప్పులు, చింతపండు గుజ్జు - 2 టేబుల్‌ స్పూన్లు, బెల్లం (ఇష్టమైతే) - 1 టేబుల్‌స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను. ఎండుమిర్చి -2, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: ఒక టీ స్పూను నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక తోటకూర కాడలు, ఆకు తరుగు, ఉప్పు, పసుపు అరకప్పు నీరు కలపాలి. ముక్కలు ముప్పావు భాగం ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం, శనగపిండి, మిగతా నీరు కలిపి ఉడికించి పక్కనుంచిన తాలింపులో కలుపుకోవాలి.

Updated Date - 2015-09-02T20:50:56+05:30 IST