కొర్రల పాయసం

ABN , First Publish Date - 2015-09-02T20:17:26+05:30 IST

కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు

కొర్రల పాయసం

కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు, పాలు - అర లీటరు, పచ్చి కర్జూరం - 1 కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, తేనె - ఒక టీ స్పూను, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కొన్ని నీళ్లు చిలకరించి కర్జూరాన్ని పేస్టులా చేసుకుని పక్కనుంచాలి. కొర్రల్ని దోరగా వేగించి, శనగపప్పుతో పాటు 3 కప్పులు నీరు పోసి 3 విజిల్స్‌ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, కర్జూరం పేస్టు కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు ఉంచాలి. తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించి, యాలకుల పొడి, తేనె చల్లి వేడి వేడిగా తినాలి. 

Updated Date - 2015-09-02T20:17:26+05:30 IST