కొర్ర లడ్డు

ABN , First Publish Date - 2015-09-02T20:13:56+05:30 IST

కావలసిన పదార్థాలు: కొర్రలు - ఒకటిన్నర కప్పు, తేనె - పావు కప్పు, పంచదార పొడి - పావు కప్పు

కొర్ర లడ్డు

కావలసిన పదార్థాలు: కొర్రలు - ఒకటిన్నర కప్పు, తేనె - పావు కప్పు, పంచదార పొడి - పావు కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నెయ్యి - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: కొర్రలను దోరగా వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. నేతిలో జీడిపప్పులు వేగించాలి. అదే కడాయిలో కొర్రలు, పంచదార, యాలకుల పొడులు వేసి కొద్దిసేపు వేగించి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత తేనె కలిపి, లడ్డూలు చేసుకుని జీడిపప్పుతో అలంకరించాలి. 

Updated Date - 2015-09-02T20:13:56+05:30 IST