కొబ్బరి రవ్వలడ్డు

ABN , First Publish Date - 2015-09-02T20:10:33+05:30 IST

కావలసిన వస్తువులు: కొబ్బరి కోరు - 2 కప్పులు, బొంబాయిరవ్వ - ఒక కప్పు,

కొబ్బరి రవ్వలడ్డు

కావలసిన వస్తువులు: కొబ్బరి కోరు - 2 కప్పులు, బొంబాయిరవ్వ - ఒక కప్పు, పంచదార - 2 కప్పులు, జీడిపప్పు - 50 గ్రా., కిస్‌మిస్‌ - 30 గ్రా., యాలకుల పొడి - 2 చిటికెలు, నెయ్యి - ఒక కప్పు.
తయారుచేసే విధానం: సన్నని సెగపైన రవ్వని పొడిగా వేగించుకోవాలి. అందులో కొబ్బరికోరును కలిపి ఒక గంటసేపు పక్కనుంచుకోవాలి. అలాగే ఒక టేబుల్‌స్పూను నెయ్యిలో కిస్‌మిస్‌ జీడిపప్పు వేసి వేగించి పక్కనుంచుకోవాలి. కడాయిలో అరకప్పు నీటిని పోసి పంచదార వేసి కరిగేదాకా తిప్పుతూ స్టౌవ్‌ కట్టేయాలి. వేరే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి పక్క నుంచిన రవ్వ, కొబ్బరికోరు మిశ్రమాన్ని లేత ఎరుపురంగు వచ్చేదాకా వేగించుకోవాలి. ఇపడు వేగిన మిశ్రమానికి జీడిపప్పు, కిస్‌మిస్‌, యాలకుల పొడిని జతజేసి పంచదార పాకంలో కలుపుకుని లడ్డూల్లా తయారుచేసుకోవాలి.

Updated Date - 2015-09-02T20:10:33+05:30 IST