Abn logo

ప్రాన్స్‌ మంచూరియా

కావ

లసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పచ్చిరొయ్యలు - 300 గ్రా., ఉల్లితరుగు - 1 కప్పు, మైదా - 1 టేబుల్‌ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం, వెలుల్లి తరుగు - 1 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అజినమోటో - చిటికెడు, టమోటా, చిల్లీ, సోయా సాస్‌లు + వెనిగర్‌ - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లికాడల తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, క్యాప్సికం - 1, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : రొయ్యలను మైదా, 2 టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌, 1 టేబుల్‌ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్‌ స్పూను సోయా సాస్‌, ఉప్పులతో కలిపి గంటసేపు పక్కనుంచి నూనెలో దోరగా వేగించాలి. కొద్ది నూనెలో వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనీగర్‌, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించాలి. రొయ్యలు, సోయా సాస్‌, చిల్లీ సాస్‌, టమోటా సాస్‌ కూడా వేసి కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లి దించేయాలి.

ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలి: ఎస్పీప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలినిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదంపశువైద్యం అందని ద్రాక్షేనా?దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల రాస్తారోకోవంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలికుమరం భీం, కుమరం సూరు వర్ధంతిముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలి‘విజయగర్జన’కు కార్యకర్తలు తరలిరావాలి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
Advertisement