చిలగడదుంప రబ్డీ

ABN , First Publish Date - 2020-01-04T16:34:24+05:30 IST

పాలు - 150 ఎంఎల్‌, చిలగండదుంపలు - నాలుగు, పంచదార - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, నట్స్‌ - కొన్ని.

చిలగడదుంప రబ్డీ

కావలసిన పదార్థాలు: పాలు - 150 ఎంఎల్‌, చిలగండదుంపలు - నాలుగు, పంచదార - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, నట్స్‌ - కొన్ని.

తయారీ విధానం: ముందుగా చిలగడదుంపను ఉడికించి, గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో చిలగండదుంప గుజ్జు వేయాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కుంకుమపువ్వు వేయాలి. కొద్దిగా గోరు వెచ్చటి నీళ్లు పోయాలి. యాలకుల పొడి వేసి మరో మూడు నాలుగు నిమిషాల ఉడకనివ్వాలి. చివరగా నట్స్‌ వేసి కలిపి దింపుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అయ్యాక సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-01-04T16:34:24+05:30 IST