పనీర్‌ టిక్కా రోల్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ - 150 గ్రాములు, మైదా - రెండు కప్పులు, పెరుగు - ఒక టీస్పూన్‌, పొడి పిండి - పావు కప్పు, నూనె - కొద్దిగా, కోడిగుడ్లు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - రెండు టీస్పూన్లు.
 
తయారీ విధానం: మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి మెత్తటి మిశ్రమంలా కలిపి రెండు, మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కాస్త ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత పనీర్‌ ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఒక పాన్‌పై చపాతీని వేసి కాల్చాలి. ఒకవైపు కాలిన తరువాత చపాతీపై కోడిగుడ్డు కొట్టి పోయాలి. ఇప్పుడు చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత పనీర్‌ ముక్కలను మధ్యలో పెట్టి రోల్‌ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే పనీర్‌ టిక్కా కాతీ రోల్‌ రుచిగా ఉంటుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement