Abn logo

చామదుంప మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: చామదుంపలు - అరకేజీ, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - తగినంత, గరం మసాలా - పావు టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకులు - మూడు, లవంగాలు - ఐదు.
 
తయారీ విధానం:
ముందుగా చామదుంపలను ఉడికించాలి. తరువాత ఒక పాన్‌ తీసుకొని కొంచెం నూనె వేసి కాస్త వేడి అయ్యాక టొమాటో ముక్కలు వేయాలి. కాసేపయ్యాక కొద్దిగా నీళ్ళు పోసి అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి చిన్న మంటపై వేగించాలి. టొమాటో ముక్కలు ఉడికిన తరువాత వెన్న, మెంతి కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
 
తగినంత ఉప్పువేసి గ్రేవీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామదుంపల పొట్టుతీసి ముక్కలుగా కట్‌ చేసి ఆ ముక్కలపై ఉప్పు, కారం, సెనగపిండి చల్లి ముక్కలన్నింటికి పట్టేలా కలపాలి. ఒక పాన్‌ తీసుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి చామదుంపల ముక్కలు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చామదుంపలు వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత గ్రేవీ పోయాలి. నిమ్మరసం, గరంమసాలా వేసి మరికాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

పరిహారం ఇవ్వండి అయ్యా..‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టండి’ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ జాతరకన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణంరేషన్‌.. పింఛన్‌ దరఖాస్తుదారుల టెన్షన్‌‘కొత్త వంగడాలతో అధిక దిగుబడులు’పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య కరోనాతో ఒకరి మృతి‘డీజిల్‌ ధరలను నియంత్రించాలి’శివగూడ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం
Advertisement
Advertisement