Abn logo

మిల్లెట్స్‌ కిచిడీ

కావలసినవి
 
మిల్లెట్లు - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం - అరకప్పు, మెంతి కూర - పావు కప్పు, టొమాటో - ఒకటి, నెయ్యి - ఒకటిన్నర స్పూన్‌, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
మిల్లెట్లను, పప్పును శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి జీలకర్ర, అల్లం వేసి వేగించాలి. టొమాటో ముక్కలు, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం ముక్కలు, మెంతికూర వేసి మరికాసేపు వేగించాలి. కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. నానబెట్టుకున్న మిల్లెట్లు, పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. చివరగా కొంచెం నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement