Abn logo

పాలకూర చికెన్‌ కర్రీ

కావలసినవి
 
పాలకూర - అరకేజీ, బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - రెండు, జీలకర్రపొడి - పావు టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.
 
తయారీవిధానం
 
పాలకూరను పావుగంట పాటు నీటిలో నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో పాలకూర వేసి, కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి. మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. కాసేపయ్యాక పాలకూర వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... నోరూరించే పాలకూర చికెన్‌ రెడీ. వేడి వేడి అన్నంతో గానీ, చపాతీతో గానీ తింటే రుచిగా ఉంటుంది.

దరలను తగ్గించాలి : వామపక్ష నాయకులుహరితహారం పకడ్బందీగా నిర్వహించాలిజిల్లాలో పటిష్ట నిఘా వ్యవస్థ : ఎస్పీసాదాసీదాగా జడ్పీ సర్వసభ్య సమావేశంపల్లె ప్రగతి ముందుకు సాగేనా?పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలిలొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాంఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌అధికారుల పల్లెబాట ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
Advertisement
Advertisement